తెలంగాణలో కొత్తగా 2,278 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,54,880

corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,278 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,458 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,54,880కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,21,925 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 950కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 331 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈమేరకు ఈరోజు ఉదయం తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడిచింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/