పట్టాభి మాల్దీవులకు వెళ్లడానికి కారణం అదేనా..?

పట్టాభి మాల్దీవులకు వెళ్లడానికి కారణం అదేనా..?

తెలుగుదేశం నేత పట్టాభి..ప్రస్తుతం దేశం వదిలి మాల్దీవులకు చెక్కేశారు. ఆయన మాత్రమే కాదు కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లారు. పట్టాభి సడెన్ గా మాల్దీవులకు వెళ్లడానికి కారణం ఆయన భార్యే అని కొన్ని మీడియా చానెల్స్ లలో ప్రచారం సాగుతుంది. పట్టాభి భార్య.. చందన కోరిక మేరకు.. కొంత రిలీఫ్ కోసం.. మాల్దీవులకు వెళ్లారని అంటున్నారు.

వైసీపీ సర్కార్ ఫై పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు పోలీసులు పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసారు. అయితే కోర్ట్ ద్వారా బెయిల్ తీసుకున్న పట్టాభి , జైలు నుండి బయటకు రాగానే మాల్దీవులకు ఫ్యామిలీ తో కలిసి వెళ్లినట్లు సోషల్ మీడియా లో ఫొటోస్ దర్శనం ఇస్తున్నాయి. పట్టాభిచేసిన వివాదాస్పద వ్యాఖ్యల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నాయకులు ఈ వ్యాఖ్యలను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో దాడులు ఇంకా జరిగే అవకాశం ఉందని.. పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా.. ప్రభుత్వం ఇంకా ఏవైనా.. కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోందని సీనియర్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 15 రోజులకు తగ్గకుండా.. పట్టాభిని దూరం పంపించాలని.. ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.