తిరుపతిలో పైనాపిల్ గణపయ్య…

ఉదయం నుండే దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. ప్రతి చోటా విగ్రహ ప్రతిష్ఠాపన, ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భక్తులంతా భక్తిలో మునిగిపోయారు. ఇక ప్రతి ఏటా సరికొత్త అవతారాల్లో దర్శనం ఇచ్చే గణపయ్య..ఈసారి కూడా అలాగే పలు మండపాలలో దర్శనం ఇస్తున్నారు. పుష్ప , ఆర్ఆర్ఆర్ గెటప్స్ లలో దర్శనం ఇచ్చిన గణనాధుడు..తిరుపతి లో పైనాపిల్ తో దర్శనం ఇచ్చారు.

తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో పైనాపిల్ వినాయకుడు కొలువుదీరాడు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి‌లు ఆవిష్కరించారు. పైనాపిల్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా వినాయక చవితిని పురస్కరించుకొని ప్రత్యేకతను చాటుకునేలా.. పర్యావరణ పరిరక్షణకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.

భారీ పైనాపిల్ వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేసేందుకు 25 మంది కార్మికులు 16 రోజులు పాటు శ్రమించి 7వేల పైనాపిల్స్‌తో భారీ వినాయకుడ్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ ఆర్కిటెక్చర్ మురళి సారధ్యంలో 22 అడుగులు ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో అతి పెద్ద పైనాపిల్ వినాయకుని ప్రతిమను సిద్దం చేశారు.