2023 – 24 బడ్జెట్ : వేటికి ధరలు పెరుగుతున్నాయి..వేటికి ధరలు తగ్గుతున్నాయంటే ..

2023 – 24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను నేడు లోక్‌స‌భ‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2023 – 24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగం మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సంస్కరణలపై దృష్టి సారించాము. పటిష్టమైన విధానాలతో 28 నెలల కాలంలో 80 కోట్లమందికి ఉచితంగా బియ్యం అందించాము. కరోనా సంక్షోభ సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాము. ఇకపై ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే పలు వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించినట్టు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. దీని ప్రకారం పలు వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ 23 శాతం నుంచి 13 శాతం తగ్గింది. దీనివల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. అలాగే పలు వస్తువులపై కస్టమ్‌ డ్యూటీ పెరిగింది. దీంతో మరికొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఇక ఈ బడ్జెట్ తో వేటికి ధరలు పెరుగుతున్నాయి..వేటికి ధరలు తగ్గుతున్నాయో చూస్తే..

ధరలు తగ్గే వస్తువులు :-

  • ఎలక్ట్రిక్ వాహనాలు,
  • టీవీలు
  • మొబైల్ ఫోన్లు
  • కిచెన్ చిమ్నీలు
  • లిథియం అయాన్ బ్యాటరీలు

ధరలు పెరిగే వస్తువులు :-

  • టైర్లు, రబ్బర్‌
  • సిగరెట్లు
  • బ్రాండెడ్‌ వస్తువులు
  • బంగారం, వెండి