ఏపిలో కొత్తగా 520 పాజిటివ్ కేసులు

మొత్తం కరోనా కేసులు సంఖ్య 8,74,515..మొత్తం మృతుల సంఖ్య 7,049

corona virus -ap

అమరావతి: ఏపి వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రంలో కరోనా కేసులపై తాజా బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 64,425 కరోనా టెస్టులు చేయగా 520 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 71, పశ్చిమ గోదావరి జిల్లాలో 69, గుంటూరు జిల్లాలో 64, తూర్పు గోదావరిలో 59 కేసులు గుర్తించారు.

అత్యల్పంగా కడప జిల్లాలో 9 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 11, విజయనగరం జిల్లాలో 12, నెల్లూరు జిల్లాలో 13, కర్నూలు జిల్లాలో 20 కేసులు వచ్చాయి. అదే సమయంలో 519 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇద్దరు మృత్యువాతపడ్డారు. కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 7,049కి పెరిగింది. ఏపిలో ఇప్పటివరకు 8,74,515 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,62,230 మంది కోలుకున్నారు. ఇంకా 5,236 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/