2023 – 24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ : ఏ శాఖకు ఎంతంటే

2023 – 24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను నేడు లోక్‌స‌భ‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. లోక్‌స‌భ‌లో ఐదోసారి బడ్జెట్ ను ఆమె ప్రవేశ పెట్టడం విశేషం. ఇప్పటివరకు ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అత్యంత చిన్నది.

ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలమ్మ కేవలం 86 నిమిషాల్లోనే ముగించారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2023 – 24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగం మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.

ఈ బడ్జెట్ లో ఏ ఏ శాఖకు ఎంత కేటాయించారో ఇప్పుడు చూద్దాం..

 • వ్యవసాయ రుణాల కోసం 20 లక్షల కోట్లు.
 • విద్యుత్ రంగానికి రూ. 35 వేలకోట్ల కేటాయింపు.
 • ఫైవ్ జి సేవల యాప్ లో అభివృద్ధి కోసం వంద పరిశోధనా సంస్థలు.
 • ఈ కోర్టుల ఏర్పాటుకు ఏడు వేల కోట్లు.
 • ఎంఎస్ఎంఈ లు, ఎన్జీవోలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరణ.
 • కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు 75 వేల కోట్లు.
 • పర్యాటక రంగ ప్రోత్సాహకానికి ప్రత్యేక చర్యలు, ఛాలెంజ్ విధానంలో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల ఎంపిక.. 50 టూరిస్ట్ స్పాట్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.
 • నిరుద్యోగం కోసం పీఎం కౌశల్ పథకం నాలుగో దశ ప్రారంభం, పీఎం కౌశల్ పథకం కింద నాలుగు లక్షల మందికి శిక్షణ, మూడేళ్ల పాటు 47 లక్షల మంది యువతకి స్టైఫండ్.
 • ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు నిధుల కేటాయింపు.
 • ఏకలవ్య పాఠశాలలకు 38.800 మంది ఉపాధ్యాయుల నియామకం.
 • పీఎం ఆవాస్ యోజనకు 79 వేల కోట్లు.
 • రైల్వే శాఖకు 2.40 లక్షల కోట్ల కేటాయింపు.
 • రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పడగింపు, వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ 13.7 లక్షల కోట్లు.
 • గిరిజనుల కోసం పివి టీజీ పథకం ఏర్పాటు, నేషనల్ డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు ప్రోత్సాహం.
 • ఫార్మా రంగా అభివృద్ధికి ప్రత్యేక పథకం.
 • పరపతి సంఘాల డిజిటలైజేషన్ కు 2000 కోట్లు.
 • రైతుల కోసం పదివేల బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాల ఏర్పాటు.
 • కృత్రిమ మేధా అభివృద్ధికి త్రి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు ఏర్పాటు.
 • రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 75 వేల కోట్లు.
 • నూతన వాహనాలకు కొనుగోలుకు రాష్ట్రాలకు సాయం, కేంద్ర ప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు, కాలం చెల్లిన వాహనాలు తొలగింపులకు తక్షణ ప్రాధాన్యత.
 • శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం.
 • పట్టణ మౌలిక వసతులు అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా పదివేల కోట్లు.
 • కర్ణాటక సాగు రంగానికి 5.300 కోట్లు సహాయం.
 • డిజిటల్ ఇండియాకు అనుగుణంగా వన్ స్టాప్ ఐడెంటిటీ కేవైసీ విధానం.