పంజాబ్‌లో 2 పాక్‌ డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్ జవాన్లు

2 Pakistani drones shot down by BSF along international border in Punjab

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎగురుతున్న రెండు డ్రోన్లు భద్రతా బలగాలు కూల్చివేశాయి. శుక్రవారం రాత్రి అమృత్‌సర్‌ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన రెండు డ్రోన్లు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. అయితే గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు.. వాటిపై కాల్పులు జరిపి నేలకూల్చారు. వాటిలో ఒకదాంట్లో అనుమానాస్పద మత్తుపదార్థాలు ఉన్న బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌సర్ జిల్లాలోని ఉధర్ ధరివాల్ గ్రామం నుంచి డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. రెండో డ్రోన్‌కు రతన్‌ ఖుర్ద్‌ గ్రామంలో స్వాధీనం చేసుకున్నామని, దానికి 2.6 కిలోల రెండు హెరాయిన్‌ ప్యాకెట్లను గుర్తించామన్నారు.