ఏపి పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ap-polycet-2023-results

విజయవాడః ఏపి పాలిసెట్‌-2023 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 10న నిర్వహించిన ప్రవేశపరీక్షలో 86.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 89.90 శాతం మంది బాలికలు, 84.74 శాతం మంది బాలురు ఉన్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://polycetap.nic.inలో ఫలితాలు చూసుకోవచ్చు.

కాగా, ఈ ఏడాది పాలిసెట్‌ కోసం 1,60,329 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,24,021 మంది అర్హత సాధించారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడేండ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.