గూగుల్ మ్యాప్ ఆధారం డ్రైవింగ్ ..ప్రాణాలు కోల్పోయిన ఇద్ద‌రు డాక్ట‌ర్లు మృతి

2 Kerala doctors die as car falls into river, were using Google map amid heavy rain

తిరువ‌నంత‌పురం : కేర‌ళ‌లోని కొచ్చిలో గత రాత్రి ఘోరం ప్రమాదం జ‌రిగింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్తున్న‌ ఓ కారు పెరియార్ న‌దిలోకి వెళ్లింది. దీంతో కారు నీట మునిగింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు డాక్ట‌ర్లు మృతి చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మృతుల‌ను డాక్ట‌ర్ అద్వైత్(29), అజ్మ‌ల్(29) గా గుర్తించారు. వీరిద్ద‌రూ ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని స్థానికులు ర‌క్షించిన‌ట్లు పేర్కొన్నారు. భారీ వ‌ర్షం కార‌ణంగా కారులో ప్ర‌యాణిస్తున్న వారికి ర‌హ‌దారి స‌రిగా క‌నిపించ‌క‌పోవ‌డం, గూగుల్ మ్యాప్ ప‌క్క‌దోవ ప‌ట్టించడం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు నిర్ధారించారు. లెఫ్ట్ ట‌ర్న్ తీసుకోవాల‌ని గూగుల్ మ్యాప్ సూచించ‌డంతో.. కారు అటుగా వెళ్ల‌డంతో న‌దిలో మునిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. దీంతో కారు నీట మునిగి ప్ర‌మాదానికి గురైంద‌ని పోలీసులు పేర్కొన్నారు.