త్వరగా కోలుకోవాలంటూ సమంత కు చిరంజీవి ట్వీట్

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత ప్రమాదకరమైన మయోసిటిస్‌ వ్యాధి తో బాధపడుతుంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే తెలిపి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాధికి సంబదించిన చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. సోషల్ మీడియా లో ఈమె చెప్పిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున సినీ , రాజకీయ ప్రముఖులు ఈమెకు సానుభూతి తెలుపుతూ, ఈమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ అక్కినేని, సుశాంత్ సహా పలువురు నటీనటులు సమంత త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

తాజాగా సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు ఎదురవుతుంటాయి.. బహుశా మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోడానికి కావొచ్చు. లోపల ఎంతో శక్తి ఉన్న ఒక అద్భుతమైన అమ్మాయివి నీవు. అతి త్వరలోనే ఈ అనారోగ్య సమస్య నుంచి బయపడుతావని బలంగా విశ్వశిస్తున్నాను. ప్రకృతి నీతో ఉంది.. త్వరగా కోలుకో సమంత’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతుంది.