తెలంగాణలో కొత్తగా 1,302 పాజిటివ్‌ కేసులు

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,72,608

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,302 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. కొత్తగా 2230 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,41,930 మంది ఇండ్లకు చేరుకున్నారు. తాజాగా మరో 9 మంది మృతి చెందగా, మొత్తం 1,042 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 22,990 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. కాగా, రాష్ట్రంలో 0.60శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 82.22శాతంగా ఉందని పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/