ఎక్కడికైనా లేట్ గా…!?

జీవన వికాసం

Latecomers

నిపుణులు ఏమంటున్నారంటే.. ఇలాంటి స్థితిని ‘సమయ అంధత్వం’ అంటున్నారు. దీన్ని సమయ పాలనా లోపం లేదా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని విధానం అని అంటున్నారు.. అంతేగాదు.. దీన్ని వైద్య పరిభాషలో ‘శ్రద్ద లేకపోవటం’ లేదా ‘హైపర్ ఆక్టివిటీ డిజాస్టర్’ గా పేర్కొన్నారు. ఒక రకంగా మానసిక ఆరోగ్య సమస్య లాంటిదే నాని చెబుతున్నారు.. వారికీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన లేకపోవటం. దీనికి శ్రద్ద అనేది అస్సలు ఉండకపోవటం కారణంగానే వాళ్ళు ఇలా దేనికైనా లేట్ గా వస్తారని అంటున్నారు.. ఇలాంటి వ్యక్తులను ముందుగా ‘లేట్’ అని పదాన్ని తొలగించుకోవాలని బలంగా అనుకోవాలి..

అన్నిటికంటే ముందు ఆరోగ్య పరంగా ఉండాలి.. సమయానికి నిద్ర పోవాలి.. ఆ తర్వాత పని అని ఫిక్స్ కావాలి. ఇందుకోసం కొద్దిగా సాంకేతికతను వాడుకుంటూ సునాయాసంగా ఆ సమస్యను తొలగించుకోవచ్చు. అలారం పెట్టుకోవటం, ముఖ్యమైన అప్పోయింట్ మెంట్స్, వెళ్లాల్సిన ప్రాంతాల గురించి వివరాలను ఓ పుస్తకంలో లేదా మొబైల్ లో రిమైండర్స్ లో పొందుపరచు కోవాలి..

రోజూ ఉదయం లేవగానే చేయాల్సినవి, ఆ బుక్ లో చూసుకుని తదనంతరం కార్యక్రమాలను ప్రారంభించాలి.. యోగ వంటి వాటితో మనసును యెల్లపుడో ఆహ్లాదంగా ఉంచుకోవాలి . ఏ పని పెండింగ్ లో ఉండకుండా ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా ఆలస్యం అనే సమస్యను తేలిగ్గా జయించవచ్చు.. అలాగే ఇలాంటి మానసిక సమస్యకు కొన్ని మాత్రలు కూడా ఉన్నాయని , వాటిని వైద్యుని పర్యవేక్షలో వారి సలహాలు, సూచనలు మేరకు వాడితే సాధ్యమైనంత తొందరగా వవ సమస్య నుంచి బయట పడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.