ఈరోజు కూడా నగరంలో 19 MMTS లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్ నగరంలో MMTS సర్వీస్ లు ఎప్పుడు నడుస్తున్నాయో..ఎపుడు నడుస్తలేదో అర్ధం కాకుండా అయ్యిపోయింది. ఈ మధ్య ఎక్కువ సంఖ్యలు సర్వీసులను రద్దు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. మరమత్తులు పేరుతో శని, ఆదివారాల్లోనే కాదు పనిదినాల్లో కూడా సర్వీసులను రద్దు చేస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో ఎంఎంటీసీ సర్వీస్ లు అందుబాటులో ఉండే, కానీ మెట్రో అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుండి పట్టుమని పది సర్వీస్ లు కూడా నడపడం లేదు.

హైదరాబాద్ లో మెట్రో అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుండి MMTS ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. గతంలో లక్షల మంది MMTS సేవలు వినియోగించుకునే వారు. కానీ ఎప్పుడైతే మెట్రో అందుబాటులోకి వచ్చింది కనీసం వందల మంది కూడా MMTS సేవలు వినియోగించుకోవడం లేదు. దీంతో వారంలో రెండు , మూడు సార్లు పలు రైళ్ల సర్వీస్ లను రద్దు చేస్తూ వస్తుంది దక్షిణ మధ్య రైల్వే . ఇక ఇప్పుడు ట్రాక్ ట్రాక్ మరమ్మతుల కారణంగా సర్వీస్ లను రద్దు చేస్తూ వస్తుంది. ఈరోజు (ఫిబ్రవరి 27) 19 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసింది.

రద్దైన సర్వీస్ ల వివరాలు..

• లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్లేవి

• హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లేవి 3

• ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లేవి 5

• లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లేవి 6

• రామచంద్రాపురం – ఫలక్‌నుమా మధ్య 2

• ఫలక్‌నుమా నుంచి హైదరాబాద్‌ వెళ్లేది 1