రెబల్స్ తో సోనియా గాంధీ భేటీ నేడు

కాంగ్రెస్ సీనియర్లు హై కమాండ్ కు లేఖ

Sonia Gandhi
Sonia Gandhi

New Delhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీ పార్టీ రెబల్స్ తో నేడు భేటీ కానున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ పతనం దిశగా పయనిస్తోందంటూ కొందరు కాంగ్రెస్ సీనియర్లు హై కమాండ్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

పార్టీలో సంస్థాగత మార్పుల ఆవశ్యకతను వారు ఆ లేఖలో నొక్కి చెప్పడమే కాకుండా, సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ పదవులు ఎంపిక పద్ధతిలో కాకుండా ఎన్నిక ద్వారా కేటాయించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

అప్పటి నుంచీ రెబల్స్ తో సమావేశానికి కానీ, వారితో మాట్లాడేందుకు కానీ ఏ మాత్రం సుముఖత చూపని సోనియా గాంధీ ఎట్టకేలకు వారితో భేటీకి అంగీకరించారు. 

ఈ రోజు వారితో భేటీ కానున్నారు. అయితే భేటీకి ఎవరెవరు హాజరౌతారన్న దానిపై స్పష్టత లేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/