కరోనా ఎఫెక్ట్‌..తెలంగాణలో ‘1895’ చట్టం

ఏ ప్రాంతాన్నైనా అధికారులు తమ అధీనంలోకి తీసుకోవచ్చు

Telangana State CM KCR
Telangana State CM KCR

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కేసులు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యలో తెలంగాణలో కఠినమైన ‘1895’ చట్టాన్ని అమలులోకి తెస్తున్నట్టు సిఎం కెసిఆర్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం, ఏ ప్రాంతాన్నైనా అధికారులు తమ అధీనంలోకి తీసుకోవచ్చు. ఒకసారి ఈ చట్టాన్ని ఓ ప్రాంతంలో అమలులోకి తెస్తే, అక్కడ దాదాపుగా నిరవధిక కర్ఫ్యూ విధించినట్టే. తిరిగి అధికారులు చెప్పేంత వరకూ ఆ ప్రాంతంలో ఎవరూ బయట సంచరించడానికి వీలుండదు. అందరూ ఇళ్లకు మాత్రమే పరిమితం కావాల్సి వుంటుంది. కరోనా వ్యాధి బాధితులు అధికంగా ఉన్న చోట ఈ చట్టాన్ని అమలు చేసే అధికారాలు సంబంధిత ప్రాంత ఆఫీసర్లకు ఉంటుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/