అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన : 21 మంది మృతి

మరోసారి అమెరికా లో గన్ కల్చర్ ఘటన బయటపడింది. బఫెలో సూపర్‌మార్కెట్ వద్ద కాల్పులు చోటుచేసుకున్న 10 రోజుల తర్వాత మరోసారి కాల్పులు చోటుచేసుకోవడం అమెరికాలో కలకలం రేపుతోంది. 18 ఏళ్ల యువకుడు స్కూల్ లోకి గన్ తో వెళ్లి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం తో 21 మంది చిన్నారులు మృతి చెందారు.

టెక్సాస్‌లోని ఉవాల్డేలో ఉన్న ఓ స్కూల్ లో 18 ఏళ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈకాల్పుల్లో 21 మంది మృతి చెందారు. వారిలో 18 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవారు ఉన్నారని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబోట్‌ తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ఆ యువకుడు హతమయ్యాడని వెల్లడించారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. 2018లో ఫ్లోరిడా, పార్క్‌ల్యాండ్‌లోని హైస్కూల్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించిన ఘటన తర్వాత.. ఈ స్థాయిలో విద్యార్థులు మృతి చెందిన అతి పెద్ద ఘోరకలి ఇదే కావడం గమనార్హం.