భారత్‌ను క్షమాపణలు కోరిన అమెరికా

భారత ఎంబసీ ముందున్న గాంధీ విగ్రహం ధ్వసం

So sorry’.. US envoy to India apologises over desecration of Gandhi

వాషింగ్టన్‌: అమెరికాలో పోలీసు అధికారుల చేతిలో మృతిచెందిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికా అంత‌టా ఆందోళ‌న‌లు మిన్నంటిన విష‌యం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే వాషింగ్టన్‌లో భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు విగ్రహంపై ముసుగు కప్పారు. జరిగిన ఘటనపై అమెరికా రాయబారి కెన్ జస్టర్ ఇండియాకు క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనపై తామెంతో చింతిస్తున్నామని, తమ క్షమాపణలను స్వీకరించాలని అన్నారు. విగ్రహ ధ్వంసంపై యునైటెడ్ స్టేట్స్ పార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/