ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే రఘునందన్

నిన్నటి నుండి మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై , ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుమారుల ఇళ్ల ఫై అల్లుడు ఇళ్లపై ,ఆఫీస్ లపై కూడా దాడులు జరిపి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల ఫై మంత్రి మల్లారెడ్డి ఘాటుగా స్పందించారు. అయితే మల్లారెడ్డి వ్యాఖ్యలను దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ తప్పుపట్టారు.

కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మల్లారెడ్డి చెప్పడం సరికాదన్న ఆయన.. సాక్ష్యాల ఆధారంగానే అధికారులు విచారణ జరుపుతారని అన్నారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. మల్లారెడ్డి ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని రఘునందన్ అభిప్రాయపడ్డారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని అన్నారు.

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి బుధువారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను సూరారం లోని హాస్పటల్ కు తరలించారు. నిన్నటి నుండి మల్లారెడ్డి ఇంటి ఫై ఆఫీస్ లపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోదాల నేపథ్యంలో నిన్న మహేందర్ రెడ్డి ఇంట్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. ఛాతి నొప్పి రావడంతో మహేందర్‌రెడ్డిని.. సురారంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తరుణంలోనే.. తన కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు సూరారంలోని ఆస్పత్రికి వెళ్లారు మంత్రి మల్లారెడ్డి. మంత్రితో పాటు ఆస్పత్రికి ఐటీ అధికారులు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేమేం దొంగ వ్యాపారాలు చేయడం లేదని ఆగ్రహించారు. నా కొడుకును ఐటీ అధికారులు కొట్టారని.. అందుకే ఆస్పత్రి పాలయ్యాడని నిప్పులు చెరిగారు. 200 మంది ఐటీ అధికారులు దాడులు చేసారని ఆగ్రహించారు మంత్రి మల్లారెడ్డి.