నేడు హనుమాన్‌ జయంతి..కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

జగిత్యాల: నేడు హనుమాన్‌ జయంతి ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్‌ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీసంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొండగట్టు కాషాయమయమయింది. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్‌.. హనుమాన్‌ నామస్మరణతో మారుమోగుతున్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/