24 గంటల్లో 148 కరోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 2,93,401

corona updates in Telangana
corona updates in Telangana

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 148 మంది కరోనా బారిన పడ్డారు. ఒకరు కరోనాతో కన్నుమూశారు.

తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,401కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,590కి చేరుకుంది.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/