అమెరికాలో దుండగుడు కాల్పులు: 6గురు మృతి

ఇండియానాలో దారుణం

6 killed in US shooting
6 killed in US shooting

అమెరికాలో దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. ఈ దుర్ఘటన ఇండియానాలో జరిగింది. సాయుధుడైన ఓ దుండగుడు ఒక ఇంట్లోకి దూరి కాల్పులు జరపడంతో ఆరుగురు మరణించారు.

ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు పక్కా ప్రణాళిక, వ్యూహంతోనే దుండగుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలిసింది.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/