తెలంగాణలో ఒక్క రోజే 14 పాజిటివ్ కేసులు

ప్రజల ఆందోళన

14 positive cases in Telangana

Hyderabad: తెలంగాణలో శుక్రవారం ఒక్క రోజే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి.

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఒక వైద్యుడి తల్లి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆ వైద్యుడికి, ఆయన భార్యకు కరోనా సోకగా తాజాగా ఆయన తల్లికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

రాష్ట్రంలో 40 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ వైరస్ వ్యాప్తి వేగం పట్ల ఆందోళన వ్యక్తమౌతున్నది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/