2024లో ఓడిపోతే వైస్సార్సీపీ ఇక ఉండదని జగన్‌కు అర్థమైంది : చంద్రబాబు
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలని అన్నానని వ్యాఖ్య

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. వైస్సార్సీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అంటూ నినాదాలు చేశారని, అయితే, ప్రజలు జై జగన్ నినాదాలు చేశారన్నట్లు వీడియోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్ట్ చేస్తున్నారని ఆయన చెప్పారు.
సీఎం వైఎస్ జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని ఆయన చెప్పారు. 2024లో ఓడిపోతే వైస్సార్సీపీ ఇక ఉండదని జగన్‌కు అర్థమైందని అన్నారు. జగన్ సింహం కాదు పిల్లి, భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. అలాగే, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలని అన్నానని, అయితే, తన వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/