దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు..1,14,475

corona virus- india
corona virus- india

న్యూఢిల్లీః దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,086 మంది వైరస్​ బారినపడగా.. మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు తగ్గింది. కొవిడ్​ నుంచి 12,456 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.26 శాతం వద్ద స్థిరంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.90శాతానికి పడిపోయింది.

భారత్​లో సోమవారం 11,44,805 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,09,87,178కు చేరింది. మరో 4,51,312 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,76,637 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 804 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,51,67,797కు చేరింది. మరణాల సంఖ్య 63,62,347 చేరింది. ఒక్కరోజే 6,59,745 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 52,98,96,665కు చేరింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/