దేశంలో కొత్తగా 12,608 కరోనా కేసులు

India – corona virus

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,42,98,864కు చేరింది. ఇందులో 4,36,70,315 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,206 మంది మరణించగా, మరో 1,01,343 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 72 మంది మరణించగా, 16,251 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రోజువారీ పాటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 208.95 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/