గౌతమ్ అదానీకి జడ్​ కేటగిరీ భద్రత

ఇందుకు నెలకు రూ. 15-20 లక్షలను భరించనున్న అదానీ

Gautam Adani gets Z category security

న్యూఢిల్లీః ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీకి కేంద్ర ప్రభుత్వం జెడ్‌ కేటగిరి భద్రత కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు ఆయనకు రక్షణ కల్పిస్తారు. మొత్తం 33 మంది కమాండోలు ఆయనకు కాపలాగా ఉంటారు. దేశంలో అదానీ ఎక్కడికి వెళ్లినా కమాండోలు ఆయనకు రక్షణ కవచంలా వ్యవహరిస్తారు. అయితే, ఈ భద్రతకు అయ్యే ఖర్చుని అదానీయే భరించనున్నారు. దీనికి నెలకి రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

దేశంలోని కొందరు ప్రముఖులకు ముప్పు ఉందని కేంద్ర భద్రతా ఏజెన్సీలు రూపొందించిన నివేదిక ఆధారంగా అదానీకి భద్రత కల్పించినట్లు వారు తెలిపారు. ఈ బాధ్యతను చేపట్టాలని సీఆర్పీఎఫ్ కు చెందిన వీఐపీ సెక్యూరిటీ విభాగానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/