దేశంలో కొత్తగా 12,516 క‌రోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 4,62,690

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిన్న 12,516 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 501 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. యాక్టివ్ కేసులు 267 రోజుల క‌నిష్ఠానికి చేరాయి. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,37,416 మంది చికిత్స తీసుకుంటున్నారు.

నిన్న క‌రోనా నుంచి 13,155 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,38,14,080కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,62,690కి పెరిగింది. నిన్న‌ 53,81,889 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,10,79,51,225 డోసుల వ్యాక్సిన్లు వాడారు. నిన్న‌ 11,65,286 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/