సంక్రాంతి బరి నుండి తప్పుకున్న భీమ్లా నాయక్ ..?

అంత అనుకున్నట్లే భీమ్లా నాయక్ కూడా సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా 2022 సంక్రాంతి బరిలో రాధే శ్యామ్ , భీమ్లా నాయక్ , సర్కారు వారి పాట, బంగార్రాజు చిత్రాలను విడుదల చేసేందుకు ఆయా చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసారు. కానీ సడెన్ గా ఆర్ఆర్ఆర్ జనవరి 07 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం తో మిగతా చిత్రాలకు ఇబ్బంది గా మారింది. పాన్ ఇండియా గా ఆర్ఆర్ఆర్ రావడం..బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు కలిసి నటిస్తుండడం తో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దీంతో మిగతా సినిమాలు రిలీజ్ విషయంలో ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే సర్కారు వారి పాట ను ఏప్రిల్ 1 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించగా..ఇక ఇప్పుడు ఇదే దారిలో భీమ్లా నాయక్ అడుగులేస్తున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి చివరి వారంలో ఈ చిత్రం విడుదలకానున్నట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్​ పోలీస్​ అధికారిగా నటిస్తున్నారు. పవన్ కు ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజైన టైటిల్​సాంగ్ రికార్డ్​ వ్యూస్​తో దూసుకెళ్తోంది. ఈ తరుణంలో సినిమా రిలీజ్ వాయిదా అనేది అభిమానులకు బ్యాడ్ న్యూస్ గా చెప్పాలి. మరి కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.