ట్విట్టర్ కు 1,200 మంది ఉద్యోగులు రాజీనామా!

ట్విట్టర్ లో కొనసాగుతున్న ఊహించని పరిణామాలు

1200-employees-resigns-to-twitter

శాన్ ఫ్రాన్సిస్కోః ట్విట్టర్ ను ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న తర్వాత ఆ సంస్థలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మస్క్ ట్విట్టర్ కు బాస్ అయిన వెంటనే సగానికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపారు. వీరిలో సీఈవో పరాగ్ అగర్వాల్ సహా ఎందరో టాప్ లెవెల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. దీంతో, ట్విట్టర్ ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితిలో ట్విట్టర్ ఉద్యోగులు ఉన్నారు.

మరోవైపు రోజుకు 12 గంటల చొప్పున వారానికి 80 గంటలు పని చేయాలంటూ మస్క్ స్పష్టం చేయడం… ట్విట్టర్ ఉద్యోగుల్లో అసహనాన్ని మరింత పెంచింది. మస్క్ చర్యను వ్యతిరేకిస్తూ ఏకంగా 1,200 మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు. వీరిలో ఎక్కువ మంది టెక్ విభాగానికి చెందిన వారేనని తెలుస్తోంది. దీంతో మస్క్ దిద్దుబాటు చర్యలకు దిగారు. రాజీనామా చేసిన ఉద్యోగులకు అత్యవసర ఈమెయిల్స్ పంపారు. వెంటనే శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/