ఏపి డీజీపీకి చంద్రబాబు లేఖ

తంబళ్లపల్లెలో దాడి ఘటనపై లేఖ

Gautam Sawang- Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపి డీజీపీకి మరో లేఖ రాశారు. తంబళ్లపల్లెలో దాడి ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని, టిడిపి కార్యకర్తలపై వైఎస్‌ఆర్‌సిపి నేతలు దాడులు చేస్తున్నారని చెప్పారు. దాడులు, దౌర్జన్యాలతో వైఎస్‌ఆర్‌సిపి నేతలు ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి మాఫియా శక్తులు స్వైర విహారం చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని, దాడిని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్నా పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ చర్యలు ఇలాగే కొనసాగుతూ పోతే ప్రజలకు పోలీసు వ్యవస్థపై ఉన్న నమ్మకం పోతుందని తెలిపారు. కాగా, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో నిన్న టిడిపి నేతల పర్యటన నేపథ్యంలో వారి వాహనాలపై కొందరు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/