బాక్స్ ఆఫీస్ వద్ద రూ.50 కోట్ల క్లబ్ లో బింబిసార-సీతారామం

గత కొద్దీ రోజులుగా థియేటర్స్ కు ప్రేక్షకులు రాకపోవడం తో చిత్రసీమ అంత కూడా అయోమయంలో పడిపోయింది. ఇక ప్రేక్షకులు థియేటర్స్ కు రాకపోవచ్చని అంత మాట్లాడుకుంటున్న సమయంలో బింబిసార , సీతారామం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించాయి. కథలో దమ్ము ఉంటె ప్రేక్షుకులు తప్పకుండ థియేటర్స్ కు వస్తారని రుజువు చేసాయి. విడుదలైన నాటినుండి నేటివరకు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్నాయి. తాజాగా ఈ రెండు చిత్రాలు 50 కోట్ల క్లబ్ లో చేరి తెలుగు సినిమా సత్తాను చాటాయి.

ముఖ్యంగా బింబిసార మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే నిర్మాత‌తో పాటు ఎగ్జిబిట‌ర్లు లాభాల బాట‌ప‌ట్టారు. ప‌ది రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 49 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిస్టారికల్ ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించారు. సంయుక్తమీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే క్లాసిక్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సీతా రామం మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు అధికారిక ప్రకటన చేసింది చిత్ర యూనిట్. మొత్తం మీద ఈ రెండు చిత్రాలు చిత్రసీమకు ఊపిరి పోశాయని అంత మాట్లాడుకుంటున్నారు. అలాగే ఆగస్టు 13 న విడుదలైన కార్తికేయ 2 కూడా సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.