నోయిడాలో భారీ అగ్నిప్రమాదం

Massive fire in Noida

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌ పై అంతస్తులో గురువారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. సెక్టార్‌ 110 లోని లోటస్‌ బౌలేవార్డ్‌ సొసైటీలో ఉన్న భవనంలో మంటలు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎయిర్‌ కండీషనర్‌లో పేలుడు కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.