కరోనా ఫై సీఎం జగన్ సమీక్ష

jagan review on corona

కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ఇప్పటికే మూడు వేవ్ లలో మనుషుల ప్రాణాలు తీసిన ఈ మహమ్మారి ..ఇప్పుడు మరోసారి వణికిస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనా లో రికార్డు స్థాయిలో నమోదు అవుతుండగా..ఇప్పుడు ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కరోనా ఫై సమీక్ష నిర్వహించారు.

కోవిడ్‌ పరంగా వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాల‌ని సీఎం జగన్ఆ దేశాలు జారీ చేశారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల సన్నద్దతను తనిఖీ చేయాలని, జనవరి 5వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న సీఎం. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాలపైనా తనిఖీలు చేపట్టాలని సూచించారు. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్‌ కెపాసిటీపై మరోసారి సమీక్షించుకోవాలన్నారు.

దేశంలోనూ ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తుండడంతో, సీఎం జగన్ నేడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాస్కులు ధరించడం తదితర కొవిడ్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. అనుమానాస్పద కేసుల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

కరోనా చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్ క్లినిక్ లు కేంద్రంగా కార్యాచరణ ఉండాలని వివరించారు. కరోనా పరీక్షలు, వైద్యసాయం విలేజ్ క్లినిక్ కేంద్రంగా జరగాలని… ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరూ విలేజ్ క్లినిక్ కేంద్రంగా అందుబాటులో ఉండాలని సీఎం జగన్ తెలిపారు. విలేజ్ క్లినిక్కులు మొదలుకుని ప్రజా ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల వరకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండాలని, ఎక్కడా మందుల కొరత అన్నమాటే రాకూడదని స్పష్టం చేశారు.