బీఆర్ఎస్‌ను బంగాళఖాతంలో కలిపేయడం కాంగ్రెస్‌తోనే సాధ్యం – పొంగులేటి

మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభలో.. . పొంగులేటి కి కండువా కప్పు పార్టీ లోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ. అనంతరం పొంగలేటి మాట్లాడుతూ.. ఆరు నెలల మథనం తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత కొద్దీ నెలలుగా అన్ని వర్గాల ప్రజలను కలిశామని.. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించామని..అందరూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒకే మాట చెప్పారని అన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్న బీఆర్ఎస్‌ను బంగాళఖాతంలో కలిపేయడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని నమ్మి.. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.

విద్యార్థుల పోరాటంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇస్తే ఏపీలో చచ్చిపోతుందని తెలిసికూడా సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మాయమాటలతో కేసీఆర్ రెండు సార్లు అధికారం చేపట్టి.. తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ గాలికొదిలేశారు. తెలంగాణ వచ్చినా 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగాలు అసలే ఇవ్వలేదు. ఎన్నో హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి అని తెలిపారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణలోనే కాదు.. దేశంలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానిని చేసేందుకు అందరం కృషి చేయాలని .. అందుకు తాను కూడా కృషి చేస్తానని పేర్కొన్నారు.