ప్రజావాక్కు: సమస్యల పై గళం

Voice of the people
Voice of the people

చట్టాలను కఠినతరం చేయాలి:- ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

రెండు తెలుగురాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాల ద్వారా సుమారు పదివేల మంది చిన్నారులను అక్రమంగా తీసుకువచ్చినట్లు గుర్తించడం తో బాలకార్మికుల సమస్య ఇంకాతీవ్రరూపంలో ఉందని అర్థమవుతోంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకొని బీహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, యుపి, ఒడిశా వంటి రాష్ట్రాల నుండి చిన్నారులను గుత్తేదారులుఅక్రమంగా తీసుకువచ్చి తెలుగు రాష్ట్రాల్లో బాల కార్మికులుగా, యాచకులుగా, దొంగలుగా మారుస్తున్న వైనం అమానుషం. కుటుంబసభ్యుల వివరాలు తెలియని కారణంగా ఇప్పటికీ ఇరవైవేల మంది రక్షిత గృహలలో ఉన్నట్లు గణాం కాలు తెలియచేస్తున్నాయి.ప్రభుత్వాలు తక్షణంస్పందించి బాల కార్మిక చట్టాలను కఠిన తరం చేయాలి. ఆపరేషన్‌ ముస్కాన్‌ వంటి కార్యక్రమాలను ప్రతి నెల పకడ్బందీగా జరిపించి, బాల కార్మికులను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలి.

కరవైన భద్రత:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

రెండు తెలుగురాష్ట్రాల్లో సంక్షేమశాఖలో చిన్నారులు, మహిళల భద్రత రక్షణకు నిధులువిడుదల చేయకపోవడం వలన లైంగిక వేధింపులు,అత్యాచారాల బాధితులకుపునరావాసం కరువైంది. బడ్జెట్‌లో గత అయిదేళ్ల నుండి ప్రభుత్వాలు ఘనంగా నిధు లు పేర్కొన్నా అరకొర నిధులు మాత్రమే విడుదల చేస్తూ వస్తున్నారు.అందువలన రాష్ట్రంలో విద్యాసంస్థలలో చిన్నారు లు, మహిళలకు కనీస అవగాహన కార్యక్రమాలను చేపట్టడం లేదు. నిధుల ఉత్తర్వులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. భరోసా కేంద్రాలలో సిబ్బందికి జీతాలు సక్రమంగా ఇవ్వక పోవడం వలన క్రమంగా మూతపడుతున్నాయి. వేధింపులు, దాడుల నుండి బాధితులను రక్షించాలి.

పెరుగుతున్న మతప్రచారాలు:-కె. కనకరాజు, విశాఖజిల్లా

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో కొందరు వివిధ మతాలని కించపరుస్తూ పోస్టింగులు పెడుతున్నారు. ఒకరి మతగ్రంథాలలో తప్పులు చూపెడుతూ తీవ్రస్థాయిలో విమర్శ లు గుప్పిస్తున్నారు. మతం అనేది వ్యక్తిగత స్వాతంత్య్రం. ఎవరి మతం వారు అనుసరించాల్సిందే. ఇంటింటికి వెళ్లడం మతప్రచారం చేయడం మానుకోవాలి. మతమార్పిడి అనేది ఎవరికి ఇష్టం వ్ఞంటే వారు చేసుకుంటారు. బలవంతంగా మత మార్పిడి చేయడం చట్టవిరుద్ధం.

పెరుగుతున్న జనాభాను అరికట్టాలి:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశంలో అప్రతిహతంగా పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించడంలో కిందా మీదా పడుతున్న భారత్‌ను భూక్షీణత సమస్యతీవ్రంగావేధిస్తోందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరిస్తోంది. అటవీ నిర్మూలన అతిగా సాగు చేయ డం, భూసారత క్షీణించడం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, పరిశ్ర మల కోసం సారవంతమైన భూమి కేటాయించడం ఇత్యాది కారణాల వలన భారతదేశంలో గత 15 సంవత్సరాలలో 9.6 కోట్లహెక్టార్ల భూమి క్షీణతకు గురయిందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చేపదేళ్లకాలంలోఆహారభద్రతకు తీవ్రమైన ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సదరు నివేదిక హెచ్చరించడం పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంకావాలి. 2010-2016 మధ్యకాలంలో కోటికిపైగా వృక్షాలను పడగొట్టేందుకు, రక్షిత ప్రదేశాలు, పర్యా వరణ సున్నిత ప్రాంతాలలో 500 ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వ డం నిస్సందేహంగా పర్యావరణానికి చేటు చేసే నిర్ణయం.

నిర్వహణలో లోపం: -అజ్జు సురేష్‌ ఆలువాల, హైదరాబాద్‌


నగరం నడిబొడ్డులో ఉండి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు, పిల్లలు ఆడుకునే ఎన్టీఆర్‌ స్టేడియం నేడు నిర్వహణ సరిగ్గా లేక చెత్తాచెదారంతో నిండిపోయింది. విపరీ తమైన దుర్గందంతో చుట్టుపక్కల నడుస్తున్న వారికీ ఇబ్బంది కలిగిస్తున్నది. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా ఎంతో మంది ప్రముఖులు వచ్చిపోతున్నా దానిని మాత్రం పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్యంలో నెం.వన్‌ అవార్డుకోసం పాకులాడుతున్న జి.హెచ్‌.ఎం.సి దృష్టికి రాకపోవడం దురదృష్టకరం.

కరవు భత్యం వెంటనే చెల్లించాలి: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

జగన్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో చెప్పే దానికంటే చాలా ఎక్కువ చేస్తుంది. ఎంతో ప్రజావ్యతిరేకత ఉన్నా ఒక రాజధాని నుండి మూడురాజధానులు చేయడం వంటివి, అధికారం చేపట్టాక నవరత్నాలు, అమ్మఒడి, ఇటీవల గోరుముద్ద వంటి ఎన్నో పథకాలను ప్రజల ముంగిట చేర్చింది. ఉద్యోగులు, అసలే సిబ్బంది కొరతతో సతమతమవ్ఞతున్నా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు వారంతా రాత్రింబవళ్లు పనిచేయడంగమనార్హం.వారికి చెల్లించాల్సిన కరవ్ఞభత్యం, వేత న సవరణ పక్కన పెట్టడం భావ్యంకాదు. ఉద్యోగ సంఘాలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఉద్యోగులను నిరాశకు గురి చేస్తున్నాయి. వెంటనే కరవ్ఞభత్యం చెల్లించాలి

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:

https://www.vaartha.com/news/sports/