వైరస్‌ కట్టడికి సమన్వయం, సహకారం అవసరం

కోవిడ్‌-19 మరింత తీవ్రం

Covid-19 Tests -file
Covid-19 Tests -file

కోవిడ్‌-19 త్వరలో ముగుస్తుందని ఎవరైనా అనుకుంటే వాళ్లది అంచనా అవుతుంది. దీనికిమందు కనుక్కొనే లోపు అది మరింత తీవ్రంగా మారుతుంది.

జంతువుల పెంపకం, వ్యవసాయం, పట్టణీకరణ తరువాత మహమ్మారులు, అంటువ్యాధులు మానవ జీవితంలో భాగంగా మారాయి.

మానవుడు జంతువులతో సహజీవనం చేయడం, జంతువులూ మనిషి జీవితంలో భాగం కావడం ఇటువంటి అంటు వ్యాధులను వ్యాప్తి చెందడానికి అవకాశా లు ఎక్కువ.

వైరస్‌ గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందే అవ కాశం వుంది. గబ్బిలాలు కేవలం మధ్యవర్తులు మాత్రమే.

అంటే వైరస్ను మనుషులకు వ్యాప్తి చేసేది కాదు. వైరస్‌ మూలం జంతువులలో కాదు ప్రకృతిలో కనుగొనబడింది. వైరస్‌ ప్రకృతిలో ఎక్కడైనా పండ్లు, పువ్వులలో కూడా ఉండవచ్చు.

మనం భయపడ వలసిన అవసరం లేదు. వైరస్‌ మానవులకు వ్యాప్తి చెందడానికి ఏకైక మార్గం పక్షులు లేదా అడవి జంతువులు. గబ్బిలలో ఒక ప్రత్యేక జాతి ఉంది.

ఇది అడవి జంతువులకు వ్యాప్తి చేయగలవు. మానవులకు కాదు. ఈ గబ్బిలాలు పాంగోలిన్లకు ఈ వ్యాధిని వ్యాప్తి చేసాయి.

ప్రపంచంలో అత్యంత చట్ట విరు ద్ధుంగా చేసే పాంగోలిన్లు క్షీరద వర్తకం. చైనాలో జంతు అక్రమ రవాణా కారణంగా ఇది పాంగోలిన్ల నుండి మానవు లకు సక్రమించింది.

భారతదేశంలో మరణాల రేటు తక్కు వగా ఉందని అనుకుంటున్నాం. కానీ ఇది తప్పుడు నిర్దా రణ ఎందుకంటే ఇంతవరకు వ్యాధి సోకిన వారు మధ్య తరగతి ఎగువ మధ్యతరగతి వారు.

వారికి శరీరంలో మంచి పోషకాహారం ఉంది. పరిశుభ్రత ఉంది.

ఈ వైరస్‌ పేదరికంలో నివసించే ప్రజలను ప్రభావితం చేస్తే, వారు జీవించగలరా? మనుషుల్లాగే వైరస్టు అభివృద్ధి చెందుతు న్నాయి. బ్లాక్‌ డెత్‌ నుండి స్పానిష్‌ ప్లూ వరకు కోట్లాది మంది మరణిచారు.

పరివర్తన చెందడం ప్రతి వైరస్‌ జీవిత చక్రంలో భాగం. ప్రారంభ దశలో వైరస్‌ ఉపిరిత్తులను మాత్రమే ప్రభావితం చేసింది. పరివర్తన చెందిన తరువాత గుండె, మూత్రపిండాలు ఇతర అవయ వాలను కూడా ప్రభావితం చేస్తుంది.

ఆర్‌ఎన్‌ఎ వైరస్‌లు బలహీనమైన వెర్షన్‌లోకి మారే అవకాశం కూడా ఉంది.

వ్యాక్సిన్‌ ఆల స్యంగా కనుగొనవచ్చు లేదా కనుగొనలేక పోవచ్చు అని శాస్త్రవేత్తలు, వైరాలజిస్ట్‌ ఎందుకు చెప్పారు? ఎందుకంటే కోవిడ్‌-19 మూలం ఇప్పటికీ ఒక రహస్యంగావుంది.

ప్రతి వైరస్‌ మూలం ఉంది. ఇప్పటి వరకు అంటువ్యాధులు, మహమ్మారులు అన్నీ 2 సంవత్సరాలు పాటు వాటి ప్రభా వం చూపించాయి.

స్పానిష్‌ప్లూ (1918-1920), బ్లిక్‌డెత్‌ (1347- 1350), స్వైన్‌ ఫ్లూ (2009,2010), రష్యన్‌ ప్లేగు (1770-1772), ప్లూ పాండ మిక్‌ (1888- 1890) మరియు ఇటీవలి ఎబోలా (2014- 2016(. కోవిడ్‌-19 ఇంకా ముగింపు తేదీ లేదు.

దీన్ని ఎలా ఆపాలి? మందు లేదు కాబట్టి ఇదే మన ముందున్న ఉత్తమ పరిష్కారం.

ఆర్థికంగా చూస్తే, ప్రతిదీ నిలిచిపోయినప్పటి నుండి అన్ని దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిలో ముఖ్యమైనది.

ఐక్యత, సంభాషణ, సంఘీ భావం, ప్రపంచ శక్తి కోసం పరుగులు తీస్తున్న దేశాలు ఉన్నాయి. ఇవి యాంటీ-వైరస్‌ కనుగొనటానికి ప్రయత్నిస్తాయి ‘సూపర్‌ పవర్‌గా ప్రవర్తిసాయి.

వైరస్‌కు జాతీయత లేదు, దానికి ఎజెండా లేదు. రాజకీయ అనుబంధం లేదు. వ్యాప్తి చెంద డానకే ఉంది.

అయితే ఎక్కడ ఎలా వస్తుంది అనేది తెలియదు. వైరస్‌ను కట్టడి చేయగలిగే ఏకైక మార్గం ప్రజలు ప్రభుత్వం మధ్య సహకారం.

ఈ పరిస్థితిని అధికారం కోసం, లాభాల కోసం ఉపయోగించు కోవాలనే శక్తులు ప్రపంచంలో పుష్కలంగా ఉన్నాయి. ఇతరులకు సహాయం చేయడం, శాస్త్ర సాంకేతిక విజ్ఞ్ఞానాన్ని పంచుకోవడం అవసరం.

  • బి.గౌతం

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/