ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మెక్‌గ్రాత్‌తో కెటిఆర్‌

ట్విట్టర్‌లో ఫోటో పోస్టు చేసిన మంత్రి

Glenn McGrath and Minister KTR
Glenn McGrath and Minister KTR

హైదరాబాద్‌: క‌చ్చిత‌మైన బౌలింగ్‌కు గ్లెన్ మెక్‌గ్రాత్ పెట్టింది పేరు. ఈ మాజీ ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్‌తో మంత్రి కెటిఆర్‌ భేటీ అయ్యారు. దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్‌లో.. హెచ్‌సీఎల్ రిసెప్ష‌న్ వ‌ద్ద మాజీ బౌల‌ర్ మెక్‌గ్రాత్‌ను మంత్రి కెటిఆర్‌ క‌లిశారు. బుధ‌వారం రోజున కేటీఆర్ త‌నకు ఇష్ట‌మైన బౌల‌ర్‌తోనూ కాసేపు ముచ్చ‌టించారు. దావోస్‌లో మెక్‌గ్రాత్‌ను చూసి కేటీఆర్ సంబ‌ర‌మాశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఆఫ్ స్టంప్‌పై మెషీన్‌లా బంతులు వేసే సంద‌ర్భాన్ని మంత్రి కేటీఆర్‌.. ఆసీస్ బౌల‌ర్‌తో గుర్తుచేశారు. త‌న మాట‌లు విని.. గ్లెన్ త‌న‌ను ఎంతో ఆప్యాయంగా భుజం త‌ట్టిన‌ట్లు మంత్రి కెటిఆర్‌ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/