పేపర్ అడ్డుపెట్టుకొని విద్యాబాలన్ బోల్డ్ ఫోటో షూట్

బాలీవుడ్ సీనియర్ నటి విద్యాబాలన్ ..బోల్డ్ ఫోటో షూట్ తో రచ్చ రచ్చ చేసింది. డ‌ర్టీ పిక్చ‌ర్ చిత్రంతో త‌న‌లోని హాట్ యాంగిల్ ని ప‌రిచ‌యం చేసి ఓ ఊపు ఊపేసింది విద్యా బాలన్. యూత్ అయితే ఆమెకు వీరాభిమానులు అయ్యారు. కేవలం సినిమాలతోనే కాదు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు విపరీతమైన పాపులార్టీ సంపాదించుకుంది.

కాగా రీసెంట్ గా డ‌బ్బూ ర‌త్నాని ఫోటోషూట్ కోసం ఏకంగా బోల్డ్ అవతారమెత్తింది. కుర్చీపై కూర్చుని.. దుస్తులు లేకుండా ఉన్న విద్యాబాల‌న్‌.. ఒక చేతిలో న్యూస్ పేప‌ర్‌.. మ‌రో చేతిలో టీ గ్లాస్ ప‌ట్టుకుని కూర్చుంది. ఈ ఫోటోలో కొంత రొమాంటిక్ లుక్స్ ఇచ్చింది. హీల్స్ .. స‌న్‌గ్లాస్‌ల‌తో ద‌ర్శ‌న‌మిస్తున్న విద్యాబాల‌న్ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ ఈ ఫొటో షూట్ చేశాడు. ఈ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను చూసిన కొందరు నెటిజెన్లు సూపర్ అంటుండగా… మరి కొందరు ఇది మరో డర్టీ పిక్చర్ అని మండిపడుతున్నారు.