ధమాకా రెండో రోజు కలెక్షన్స్

మాస్ రాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ధమాకా మూవీ గ్రాండ్ గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. కాగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ధమాకా ..ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమైంది. పాతకథనే..మళ్లీ చూపించారు తప్ప..కొత్త కథ – కథనం లేదని ప్రేక్షకులు అంటున్నారు. అయితే సినిమా వసూళ్లు మాత్రం టాక్ తో సంబంధం లేకుండా వస్తున్నాయి.

రెండో రోజు కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ.1.62 కోట్లు
సీడెడ్ లో రూ. 62 లక్షలు
ఉత్తరాంధ్ర రూ.44 లక్షలు
ఈస్ట్ రూ.20 లక్షలు
వెస్ట్ రూ.14 లక్షలు
గుంటూరు రూ.19 లక్షలు
కృష్ణ రూ.20 లక్షలు
నెల్లూరు రూ.12 లక్షలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం శనివారం 3.53 కోట్లు షేర్ వచ్చింది.

ఇక శని ఆదివారాల్లో కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ.3.72 కోట్లు
సీడెడ్ లో 1.34 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.1.00 కోట్లు
స్ట్ లో రూ.44 లక్షలు
వెస్ట్ లో రూ.40 లక్షలు
గుంటూరులో రూ.59 లక్షలు
కృష్ణలో రూ.45 లక్షలు
నెల్లూరులో రూ.25 లక్షలు.. రెండు రోజుల షేర్ కలెక్షన్స్ రూ.8.19 కోట్లు వచ్చాయి.