18 పేజెస్ రెండు రోజుల కలెక్షన్స్

కార్తికేయ 2 ఫేమ్ నిఖిల్ – అనుపమ జంటగా ప్రతాప్ తెరకెక్కించిన ప్రేమ కథ చిత్రం 18 పేజెస్. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వచ్చిన సినిమా కావడం..ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉంటుందని అనుకున్నారు కానీ ప్రేక్షకుల అంచనాలు తలకిందులు అయ్యాయి. ప్రేమ కథ చిత్రానికి క్రైమ్ జోడించడం..అది కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం తో ప్రేక్షకులు నిరాశకు గురి అయ్యారు. అయితే నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ఆన్ స్క్రీన్ బాండింగ్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఫీల్‌గుడ్ మూవీ అనే అభిప్రాయాన్ని సొంతం చేసుకొన్నది.

ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే..రెండు రోజుల్లో నైజాంలో రూ. 1.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 27 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో మొత్తంగా రూ. 2.28 కోట్లు షేర్, రూ. 4.45 కోట్లు గ్రాస్ వసూలైంది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 48 లక్షలు వచ్చాయి. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.01 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.05 కోట్లు గ్రాస్ వసూలైంది.