ద.కొరియా మాజీ అధ్యక్షుడికి 17 ఏళ్ల జైలు

Lee Myung-bak
Lee Myung-bak

సియోల్‌: దక్షిణకొరియా మాజీ అధ్యక్షుడు లీ మైంగ్‌బక్‌ను అవినీతి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసుల్లో సియోల్‌ హైకోర్టు దోషిగా తేల్చింది. 17ఏళ్ల్ల జైలు, 1.9 కోట్ల డాలర్ల భారీ జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్‌ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం…లీ మైంగ్‌బక్‌ 2008 నుంచి 2015 వరకు దక్షిణకొరియా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేగాకుండా, ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని, సామ్‌సంగ్‌ గ్రూపునకు లబ్ది చేకూర్చేందుకు భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించారని ఆరోపిస్తూ సియోల్‌ పోలీసులు కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. అవినీతి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసుల్లో దిగువ కోర్టు లీ మైంగ్‌బక్‌ను దోషిగా తేల్చింది. ఆయనకు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/