జూన్ 1 వరకు లాక్‌డౌన్ : బోరిస్

జులై 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షల తొలగింపు

Johnson named his son with doctors name
boris johnson

లండన్‌: కరోనా మహమ్మారి అగ్రరాజ్యాల్లో విలయతాండవం చేసున్న విషయం తెలిసిందే. కాగా బిటన్‌లో ఇటీవల కొంత నెమ్మదించిన కరోనా కేసులు మళ్లీ పుంజుకున్న నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్‌డౌన్‌ను వచ్చే నెల ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈసందర్భంగా బోరిస్ జాన్సన్ నిన్న దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లాక్‌డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదని పేర్కొన్న ఆయన జూన్ ఒకటో తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు తెలిపారు. జూన్ 1 నుంచి కొన్ని ప్రాథమిక పాఠశాలలు, కొన్ని ఇతర దుకాణాలు తెరుచుకుంటాయన్నారు. అలాగే, జులై 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలను సడలించనున్నట్టు చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం తప్పనిసరి అని ప్రధాని స్పష్టం చేశారు. ఎవరికివారు జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోవాలని బోరిస్ పిలుపునిచ్చారు. వైరస్‌ ప్రభావం ఎక్కువకాలం ఉండే అవకాశం ఉందని, మహమ్మారిని అణచివేసేందుకు సరైన ఔషధం వచ్చే వరకు లాక్‌డౌన్‌‌ను పొడిగించడం తప్ప మరో మార్గం లేదన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/