వైద్యులు, సైంటిస్టులతో వీడియో కాన్ఫరెన్స్

ఆత్మవిశ్వాసం పెంచేందుకు కృషి చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి

వైద్యులు, సైంటిస్టులతో  వీడియో కాన్ఫరెన్స్
Chandra babu Naidu

Amaravati: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచేందుకు కృషి చేయాలని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వైద్యులు, శాస్త్రవేత్తలను కోరారు.

వైద్యులు, సైంటిస్టులతో ఆయన ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. .

ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్‌లో లోపాల వల్లే ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా ముప్పు తీవ్రమైందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.   

4టీ విధానం వల్లే దక్షిణ కొరియా ఈ మహమ్మారిని నిరోధించగలిగిందని చెప్పారు.

కరోనా నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నివర్గాల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని వైద్యులు, శాస్త్రవేత్తలను ఆయన కోరారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/