కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసిన హరీశ్ రావు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల కోసం చండీగఢ్ వెళ్లిన హరీశ్ రావు

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. జీఎస్డీ కౌన్సిల్ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం బుధవారం చండీగఢ్ వెళ్లిన హరీశ్ రావు మర్యాదపూర్వకంగానే సీతారామన్‌తో భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణకు చెందిన అంశాలేమీ కూడా ప్రస్తావనకు రాలేదని సమాచారం.
కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా తెలంగాణ చెల్లించిన మొత్తం.. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన నిధులపై బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో నిర్మల, హరీశ్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తనతో హరీశ్ రావు భేటీ అయిన విషయాన్ని నిర్మల కార్యాలయమే వెల్లడించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/