అర్థం తెలియకపోతే, అడుగులు తడబడతాయి!

ఇల్లు-ఇల్లాలు-పిల్లలు-చదువు

Children's education
Children’s education

విద్యాసంవత్సరం మొదలైన ఏడాదికాలంగా చదువు తూనే ఉండవచ్చు. అంత మాత్రాన ప్రతి విద్యార్థీ పాఠ్యాంశాల్లోని ప్రతి పదానికీ అర్థం తెలిసి ఉంటారని కాదు. ఎక్కువ పదాలు తెలిసినవే అయినా అక్కడక్కడ కొన్ని తెలియని పదాలు కూడా ఉంటాయి.

అయితే కొంత మంది పిల్లలు తెలియని పదాలకు ఊహాత్మకమైన అర్థాలను జోడించి దొర్లించుకుపోతూనే ఉంటారు. ఏదో బద్దకంతో ఎప్పటికప్పుడు ఆయా పదాల్ని దగ్గర దాటేసుకుపోతున్నా, కంట్లో నలుసులా, పంటికింద రాయిలా ఒక్కో పదం ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అందువల్ల తెలియన పదాల దగ్గర నిరం తరం దాటవేసే ప్రయత్నం చేయకుండా, అవసర మూనప్పుడు నిఘంటువును తిరగేయడమే మేలు. తెలియని పదాలతో కలిగే మరో నష్టం ఏమిటంటే చదివే వేగం బాగా తగ్గిపోతుంది.

పదాలకు సరియైన అర్థం తెలియకుండానే ఆన్సర్‌ చేసే ప్రయత్నంలో విషయం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. పైగా, తెలిసీ తెలియని అవగాహనతో ఆన్సర్‌ చేయడంలో ఒక ఆత్మనూన్యతాభావం కలుగుతుంది. ప్రతి పదానికి అర్థం తెలిసినప్పుడు రాసే వేగం పెరగడమే కాదు విషయాన్ని విశ్లేషించడంలో ఒక కొత్త శక్తి పుట్టుకొస్తుంది.

నిజానికి ఈ ప్రయత్నం అంతకు ముందెప్పుడో అంటే కొత్త పదం చెవిలోనో, కంట్లోనో పడ్డట్టు చేయాలి. పరీక్షల రోజుల్లో నిఘంటువు ఎదుర్కోవడం వల్ల సమయం వృధాఅయిపోతుంది కదా అనిపించవచ్చు. కానీ పదాలకు అర్థం తెలియక చదివే వేగం బాగా తగ్గిపోవడంతో వృధా అయ్యే సమయం కూడా తక్కువేమీ కాదు అందువల్ల తెలియని పదాలు కొరకరాని కొయ్యల్లా వేధిస్తాయనే నిజాన్ని పిల్లలకు అర్థం అయ్యేలా తల్లితండ్రులు చెప్పాలి.