జీవితాన్ని నేర్పే రిలేషన్‌షిప్‌

మానసిక వికాసం

Ralationship with life partner
Ralationship with life partner

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నడుస్తున్నందున మనమంతా 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఈ 21 రోజుల్లో 21 పాఠాలు నేర్చుకుందాం అంటూ ఒక అధికారి చెప్పారు.

బంధాలు మన జీవన విధానం మన ఉనికిని తెలుపుతాయి. అందుకే ఇతరులతో మన బంధం ఆదర్శంగా ఉండాలి.

బంధం అనేది ఒక్క తల్లిదండ్రులతోనో, భార్యాపిల్లతోనో ముగిసేది కాదు.

స్నేహితులు, బంధువులు, వర్గీయులు, సహాయకులు, తోటి ఉద్యోగులతో ఇలా మనం కలిసే వాళ్లందరితో పెనవేసుకుపోతుంది.

కాలం, వయసుతో పాటు వాళ్లతో ఉండే బంధం తగ్గిపోతూ ఉంటుంది.

దాన్ని మళ్లీ పటిష్టం చేసుకుందామనుకున్న ఆ సమయానికి అది నిరర్థకమే. భూమ్మీద బతికేందుకు పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం అవుతాయని అంటారు.

పెళ్లి అనేది కూడా కొన్ని కండిషన్లతోనే ఉంటుంది. అందుకే చాలా పెళ్లిళ్లు విఫలమవడం చూస్తూనే ఉన్నాం.కొందరి వైవాహిక జీవితాల్లో పొరపొచ్చాలు వస్తుంటాయి.

కొన్ని తెగిపోయేలా ఉంటాయి. అలా వందలాది జంటలు. అంటే ఓపిక లేకపోవడం, ఒకరిపై ఒకరు డిమాండ్‌ చేయడం, భావోద్వేగాలను కించపరచడం లాంటివి అని తెలిసిందే.

అయితే ఇవి మీ తప్పులు అని చెపితే ఏ ఒక్కరూ ఒప్పుకోరు. ఒకరి బ్రష్‌ ఒకరు టచ్‌ చేశారని, నీట్‌గా ఉండరని ఇలా చిన్న కారణాలకే భార్యభర్తల మధ్య దూరం పెరుగుతుంది.

వాస్తవానికి భార్యాభర్తలు అనేవారు రెండు వేర్వేరు మనసులు. ఎవరి వ్యక్తిగతం వారిది. అందుకే భార్యభర్తలు ఇద్దరూ కూర్చుని ఓపెన్‌ఆ మాట్లాడుకుంటే పొరపొచ్చాలు ఉండవు.

ఒక చెట్టు పెరగాలంటే దానికి కావాల్సిన నీళ్లు, న్యూట్రిషన్స్‌ అందాలి. అలా అయితేనే చెట్టు బలంగా పెరుగుతుంది.

Ralationship with life partner-

వైవాహిక బంధం పటిష్టంగా ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది.

భాగస్వామితో గడపడం, వారికి ఇష్టమైనవి చేయడం లాంటివి వారిని సంతోషంగా ఉంచుతాయి. అయితే కరోనా నేపథ్యంలో 21 రోజులు ఇంట్లోనే ఉండే ఛాన్స్‌ వచ్చింది.

ఈ సమయాన్ని ఇంటిల్లిపాదితో ఇంట్లోనే గడిపేలా ప్లాన్‌ చేసుకుంటే మంచిది. దాని వల్ల పోలీసులకు, కోర్టులకు భారం కాకుండా ఉంటాం. వారి పనిని వాళ్లు చేసుకునేలా చేసిన వాళ్లం అవుతాం అంటున్నారు.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/