గొడవ పడకుండా…ఓపిగ్గా చెప్పుకుంటే సరి..

జీవన వికాసం

చిన్న చిన్న తగాదాలే చిలికి చిలికి గాలి వానలు అవుతుంటాయి.. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవ పడితే పెరిగేది దూరమో.. అలా కాకూడదంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు ఇలా..

Affection-between-husband-and-wife
Affection-between-husband-and-wife-

ఆఫీసులో ఉన్న పని ఒత్తిడి ఇంట్లో చూపించటం సహజం… ఆ చికాకు తో ప్రతి చిన్న విషయానికి భాగస్వామిపై కయ్యానికి దిగుతూ ఉంటాం.. అలా కాకుండా బయటి విషయాలన్నీ బయటే వదిలేడీసీ ప్రశాంతంగా ఇంటికి వెళ్తే మంచిది..

ఏదైనా చిన్న గొడవ మొదలైనపుడు ఇద్దరూ పోటీ పడి అరిచినంత మాత్రాన సమస్యకి పరిష్కారం దొరకదని గుర్తుపెట్టుకోవాలి… భాగస్వామి కోపంతో అరుస్తున్నపుడు మీరు కూడా ఎదురు వాదనజు దిగకుండా ప్రశాంతంగా ఉండి చూడండి . వారే కొంతసేపటికి మామూలు స్థితికి చేరుకుంటారు..

Affection-between-husband-and-wife
Affection-between-husband-and-wife

భాగస్వామిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే , మీకు నచ్చని ఏ విషయాన్నైనా కోపంతో చిరుబురులాడుతూ కాకుండా , నిదానంగా నచ్చ చెప్పండి.. అలాగే, మీలో మార్చుకోవాల్సిన విషయాలు ఏమిటో కూడా అడిగి చూడండి.. బలవంతంగా మీ ఇష్టాలను కూడా భాగస్వామి పై రుద్దే ప్రయత్నం చేయకండి.. వారి అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వండి.. చాల సంతోషిస్తారు..

పిల్లలు పుట్టిన తర్వాత సాధారణంగా దంపతులు వారిని మెప్పించేందుకు అప్పుడపుడు షికారుకు తీసుకెళ్ళటమో, చిన్న , చిన్న బహుమతులో ఇచ్చి చూడండి.. పనులను పంచుకుంటూ, ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా వ్యవహరిస్తూ నడుచుకుంటే బంధం మరింత బలపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/