చర్మ సంరక్షణలో..బొగ్గు పొడి

అందమే ఆనందం

ఇది తెలుసా. ? .బొగ్గు (యాక్టివేటెడ్ చార్ కోల్) ను సైతం చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చని… దీంతో వేసుకునే కొన్ని పూతలు చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మారుస్తాయి.. అవేంటో తెలుసుకుందాం..

వాతావరణంలో ఉండే దుమ్ము, ధూళి చర్మంపై చేరటం వలన స్వేద రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది.. తద్వారా అవి మరింత పెద్దగా కన్పిస్తాయి.. అందుకే మీ పేస్ మాస్క్ లో కొద్దిగా బొగ్గు పొడిని ఉపయోగిస్తే అది మృత కణాలను తలగిస్తుంది.. మురికి బయటకు వచ్చేలా చేస్తుంది..

ఏ కాలమైనా చాలా మందిని జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటుంది.. ఇలాంటి వారు యాక్టివేటెడ్ చార్ కోల్ తో తయారు చేసిన మాస్క్ క్లేన్సర్ ని వాడితే అతిగా విడుదలయ్యే నూనెలు తొలగి పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.. అలాగే ఈ మాస్క్ క్లేన్సర్ చర్మం సహజ నూనెలను కోల్పోకుండా చేస్తుంది కూడా.

శరీరానికి ఏవైనా గాయాలైనపుడు కొన్ని రోజులకు అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది.. బొగ్గు పొడిలో కాసిన్ని నీళ్లు కలిపి మిశ్రమంలా చేయాలి.. గాయాలు, , ఇన్ఫెక్షన్ వచ్చిన చోట దీన్ని పూతలా వేస్తే మంచి ఫలితం ఉంటుంది.. వాపు కూడా తగ్గుతుంది..

దంతాలు పచ్చగా కన్పిస్తున్నాయా?

అయితే కొద్దిగా బొగ్గుపొడి లో వంట సోడా కలిపి ఈ మిశ్రమంతో వారానికో సారి పళ్లు తోముకుంటే ముత్యాల్లా మెరుస్తాయట..

‘స్వస్థ’ ఆరోగ్య సంబంధిత వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/