హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం

జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం

media
media

ఛండీఘడ్‌: కరోనా మహామ్మారి దేశంలో విస్తరిస్తుంది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలో మీడియా సిబ్బందికి కరోనా వైరస్‌ సోకడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా వార్తల సేకరణలో ఉన్న మీడియా మిత్రులకు రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రకటించారు. ఇప్పటికే ముంబైలో యాబై మందికి, చెన్నైలో సుమారు 20 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/