సూర్యాపేటలో యాక్షన్‌ ప్లాన్‌

క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారలకు ఆదేశాలు

higher officers in suryapet
higher officers in suryapet

సూర్యాపేట: తెలంగాణలో కరోనా కేసుల జిహెచ్‌ఎంసి తరువాత అత్యధికంగా నమోదయినది సూర్యాపేట జిల్లాలోనే. దీనితో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల కట్టడికి స్పెషల్‌ అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ను అమలుచేస్తున్నారు. కరోనా కేసులు నమోదు అయిన ప్రాంతాలలో సంచరిచిన వారిని గుర్తించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఒక స్పెషల్‌ బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. దీంతొ సూర్యాపేటలో కఠిన నిబందనలతో లాక్‌డౌన్‌ను అమలుచేస్తు ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 83 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో సిఎం కెసిఆర్‌ సూర్యాపేటపై ప్రత్యేక దృష్టి సారించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/